James Cameron: చెర్రీ పాత్ర అద్భుత: .. అవతార్ సృష్టికర్త ప్రశంసలు

X
By - Chitralekha |15 Feb 2023 10:48 AM IST
ఆర్.ఆర్.ఆర్. సినిమాపై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు; రాజమౌళితో తీరిగ్గా మాట్లాడాలంటూ మనసులో మాటను బయటపెట్టిన కామెరూన్
ఆర్.ఆర్.ఆర్ సినిమా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తలకు ఎక్కింది. సుప్రసిద్ధ దర్శక దిగ్గజం, అవతార్ సృష్టికర్త జేమ్స్ కేమరూన్ సినిమాపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్.ఆర్.ఆర్. సినిమా గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా రామ్ చరణ్ పోషించిన రామ్ పాత్ర తనకు ఎంతో నచ్చేసిందంటూ కితాబు ఇచ్చారు. ఆ పాత్రను అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని, ఒక్కసారి అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు. అక్కడే దర్శకుడు విజయం సాధించాడని అన్నారు. ఇదే విషయాన్ని రాజమౌళికి స్వయంగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే అతనితో ఎక్కువ మాట్లాడలేకపోయానని, జనసందోహం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం గడపలేకపోయానన్నారు. అయితే సమయం చిక్కితే రాజమౌళితో మాట్లాడి సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టారు. తాను కెనాడాకు చెందిన వ్యక్తి కావడం వల్ల భారతీయులు ఈ సినిమా చూశాక ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోగలనని అన్నారు. వారి చరిత్రకు సంబంధించిన కథ కాబట్టి మరింత శక్తివంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com