Kali Maa Row: అరెస్ట్ వద్దు: సుప్రీం
హిందూ దేవత 'కాళి మాత' ను సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిందని డైరెక్ట్‌ర్ లీనా మణిమేకలై మీద ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాలలో కేసులు నమోదు చేశారు. ఈ కేసులో లీనాను అరెస్టు చేయవద్దనీ సుప్రీం కోర్టు ఆదేశించింది. డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం ఆమెపై ఈ కేసులకు, గాని దీనికి సంబంధం ఉన్న కేసులలోనైనా ఎటువంటి చర్యలు తీసుకోరాదని జస్టిస్ నరసింహా వెల్లడించారు. లీనా తరపున న్యాయవాది కామినీ జైస్వాల్ వాధించారు. వాదనలో ఏ వ్యక్తి లేదా ఏ మతపరమైన మనోభాలు కించపరిచే ప్రయత్నం చేయలేదని, రాజ్యాంగ బద్ధంగానే వారు ఈ చిత్రాన్ని తీశారని, "కాళి" డాక్యుమెంటరీ పోస్టర్‌పై పెట్టిన కేసులన్నీ కొట్టివేయాలని, సోషల్ మీడియాలో లీనాపై బెదిరింపులకు పాల్పడిన వారికి శిక్షపడేలా చూడాలని ధర్మాసనాన్ని కోరుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com