Kamal Haasan: 41 ఏళ్ల తర్వాత కలిసి నటించనున్న రజినీ, కమల్..
Kamal Haasan: కమల్ హాసన్, రజినీకాంత్.. ఈ ఇద్దరు కోలీవుడ్‌కు రెండు కళ్లులాంటి వారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాల కోసమే జీవితాలను అంకితం చేశారు వీరిద్దరు. అయితే రజినీకాంత్ డెబ్యూ చేసే సమయానికి కమల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. అయితే దాదాపు 41 ఏళ్ల తర్వాత కమల్, రజినీ కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి 9 తమిళ సినిమాలు, రెండు తెలుగు సినిమాలు, ఒక్క బాలీవుడ్ చిత్రంలో నటించారు. కానీ ఇవన్నీ రజినీకాంత్ అప్‌కమింగ్ యాక్టర్‌గా ఉన్న రోజుల్లోనే జరిగిపోయాయి. వీరిద్దరు చివరిగా బాలచందర్ తెరకెక్కించిన 'తిల్లు ముల్లు'లో కలిసి కనిపించారు. ఇందులో రజినీకాంత్ హీరోగా కనిపించగా కమల్ గెస్ట్ రోల్ చేశారు.
కొన్నాళ్ల క్రితం కమల్ హాసన్ నిర్మాణంలో రజినీ ఓ మూవీ చేయడానికి ఒప్పుకున్నారు. దీనికి లోకేశ్ కనకరాజ్‌ను డైరెక్టర్‌గా కూడా ఫైనల్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయి 'విక్రమ్' తెరపైకి వచ్చింది. అయితే ఎలాగైనా ఈ సినిమాను పట్టాలెక్కించాలని కమల్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. అంతే కాకుండా కమల్ కూడా రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com