29 May 2022 12:58 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Kamal Haasan: ఆ హీరో...

Kamal Haasan: ఆ హీరో చేతులు పట్టుకొని ప్రాధేయపడినా నాతో నటించలేదు: కమల్ హాసన్

Kamal Haasan: ఇటీవల విక్రమ్ మూవీ ప్రమోషన్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు కమల్ హాసన్.

Kamal Haasan: ఆ హీరో చేతులు పట్టుకొని ప్రాధేయపడినా నాతో నటించలేదు: కమల్ హాసన్
X

Kamal Haasan: సినీ పరిశ్రమ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే నటులతో కమల్ హాసన్ ఒకరు. తాను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి విభిన్నమైన కథలు, పాత్రలవైపు ఆయన అడుగేశారు. అందులో చాలావరకు ప్రయోగాలు సూపర్ హిట్ అందుకున్నాయి కూడా. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో 'విక్రమ్' అనే చిత్రం చేస్తున్నాడు కమల్. తను ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు.

కమల్ హాసన్‌ను కలిస్తే చాలు అని ఎంతోమంది అప్‌కమింగ్ నటీనటులు ఆశపడుతుంటారు. ఆయనతో ఒక సీన్‌లో నటించినా చాలు అనుకునేవారు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది దర్శకులు కమల్‌ను డైరెక్ట్ చేయాలని అనుకుంటారు. అయితే కమల్ హాసన్‌కు కూడా ఒక హీరోతో నటించాలని కోరిక ఉండేదట. కానీ అది నెరవేరలేదు.

కమల్ హాసన్, శివాజీ గణేశన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'థేవర్ మగన్'. ఈ సినిమాలో హిందీలో రీమేక్ చేసి లెజెండరీ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి నటించాలి అనుకున్నాడట కమల్. అందుకోసం దిలీప్ కుమార్‌ను చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడట కూడా. కానీ దిలీప్ కుమార్ అప్పటికీ యాక్టింగ్‌కు దూరమవ్వడంతో ఆయన ఒప్పుకోలేదట. అందుకే ఈ రీమేక్‌ను అనిల్ కపూర్, అమ్రీష్ పూరీతో తెరకెక్కించాడు దర్శకుడు ప్రియదర్శన్.



Next Story