Kamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు అడ్డొస్తే..

Kamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు అడ్డొస్తే..
Kamal Haasan: ప్రస్తుతం కమల్.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Kamal Haasan: చాలాకాలంగా మన జాతీయ భాష హిందీనే. దీనిని మార్చడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఎక్కువశాతం దీనిని ఎవరూ ఖండించలేదు కూడా. అయితే ఈమధ్య మా మాతృభాష మాకే గొప్ప కాబట్టి హిందీని జాతీయ భాషలాగా ఎందుకు ఒప్పుకోవాలి అనే వాదన మొదలయ్యింది. చాలావరకు సౌత్ వారు దీనిని సపోర్ట్ చేస్తున్నారు కూడా. తాజాగా కోలీవుడ్ నుండి కమల్ హాసన్ కూడా ఈ వివాదంపై స్పందించారు.

సినీ పరిశ్రమలో ఒక చిన్న ట్వీట్‌తో ప్రారంభమయిన ఈ జాతీయ భాషా వివాదం.. ప్రస్తుతం అన్ని భాషా పరిశ్రమల వరకూ వెళ్లింది. శాండిల్‌వుడ్ నుండి సుదీప్, బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్ మధ్య కొంతకాలం ఈ విషయంపై ట్వీట్ వార్ కూడా నడిచింది. ఇక తాజాగా కోలీవుడ్ నుండి కమల్ హాసన్ సైతం ఈ విషయంపై తన సినిమా ఈవెంట్‌లో స్పందించాడు.

ప్రస్తుతం కమల్.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అక్కడే కమల్ హిందీ భాషా వివాదంపై స్పందించాడు. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం తన బాధ్యతని, దీనికి ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటానని కమల్ అన్నాడు. అలా అని తాను హిందీ భాషకు వ్యతిరికేని కాను అని కూడా అన్నాడు కమల్ హాసన్.

Tags

Read MoreRead Less
Next Story