Chaitra Hallikeri: భర్త వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..

Chaitra Hallikeri: Chaitra Hallikeriబయటే కాదు సినీ పరిశ్రమలో కూడా భర్త నుండి భార్య వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి. ఏదైనా మనస్పర్థలు వస్తే.. విడాకులు తీసుకొనేవారు కొందరైతే.. భార్యను వేధించే వారు మరికొందరు. తాజాగా ఓ నటి తన భర్త తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అంతే కాకుండా వారి వల్ల ప్రాణహాని ఉందని కేసు నమోదు చేసింది.
కన్నడ నటి చైత్ర హలికేరి.. బాలాజీ పోత్రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఇటీవల తన భర్త బాలాజీ.. తండ్రితో కలిసి చైత్ర బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను తనకు తెలియకుండా తీసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఈ విషయంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ మ్యానేజర్ కూడా వారికి సాయం చేశాడని చైత్ర ఫిర్యాదులో పేర్కొంది.
చైత్ర తనకు తెలియకుండానే తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న క్యాష్, గోల్డ్‌ను భర్త, మామ డ్రా చేశారని కంప్లైంట్‌లో పేర్కొంది. ఇది తెలిసి భర్తను నిలదీయగా తనను హింసించినట్టు తెలిపింది. అందుకే తన భర్త, మామ నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని చైత్ర పోలీసులను కోరిందట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com