Swathi Sathish: వికటించిన థెరపీ.. నటి రూపురేఖలనే మార్చేసింది..

Swathi Sathish: సినీ పరిశ్రమలో ఉండే నటీనటులకు అందంగా కనిపించాలనే ఒత్తిడి ఉంటుంది. అందుకే వారు అందంగా కనిపించడం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడంతో పాటు కొందరు సర్జరీలు లాంటివి కూడా చేయించుకుంటారు. అలాంటివి వికటించి పూర్తిగా రూపురేఖలు మారిపోయిన వారు కూడా ఉన్నారు. ఇటీవల మరో నటికి కూడా అలాగే జరిగింది.
కన్నడలో పలు చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి సతీష్. ఇటీవల ఆమె రూట్ కెనాల్ అనే ఓ థెరపీ కోసం ఓ డెంటిస్ట్ దగ్గరకి వెళ్లింది. ఆ వైద్యం పూర్తయిన తర్వాత తన మొహం అంతా వాచిపోయింది. అయితే అది థెరపీ వల్ల అయిన వాపు అని మూడు రోజులు తగ్గిపోతుందని వైద్యులు తెలిపారట. కానీ మూడు వారాలైనా తగ్గగపోవడంతో స్వాతి ఇప్పుడు దీని గురించి బయటపెట్టింది.
డెంటిస్ట్ తనకు థెరపీ సమయంలో అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్టు స్వాతి ఆరోపించింది. దీని వల్లే తన మొహం అలా అయిపోయిందని, దాని వల్ల వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయంటోంది. అంతే కాకుండా ఇలా బయటికి వెళ్లినా ఎవరూ గుర్తుపట్టడం లేదని వాపోతోంది స్వాతి సతీష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com