Karnataka: గాయకుడిపై దాడి
X
By - Chitralekha |30 Jan 2023 11:15 AM IST
ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ పై దాడి; కాన్సర్ట్ జరుగుతుండగా దాడి చేసిన అభిమాని; పోలీసుల అదుపులో నిందితుడు
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ పై దాడి జరిగింది. కర్ణాటకలోని హంపీలో కాన్సర్ట్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేజ్ పై కైలాశ్ పాటలో నిమగ్నమై ఉండగా అభిమానుల మధ్యలో నుంచి ఓ వ్యక్తి అతడిపైగి వాటర్ బాటిల్ విసిరేశాడు. ఈ ఘటనలో కైలాశ్ కు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. అయితే ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు బాటిల్ విసిరిన వ్యక్తిని హుటాహుటిన అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.....
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com