Katrina Kaif : మాల్దీవులలో మజా చేస్తున్న కత్రినా, విక్కీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ తన 40 వ ఏట అడుగుపెడుతోంది. తన భర్తతో మాల్దీవ్స్ లో బర్త్ డేను గ్రాండ్ గా జరుపుకుంది. ఆ ఫోటోలను తన భర్త, నటుడు విక్కీ కౌశల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక విక్కీతో పాటు కత్రినా కైఫ్ సిబ్లింగ్స్ కూడా కత్రినా చిన్నప్పుటి ఫోటో ఉన్న ప్రత్యేక టీ షర్ట్స్ ధరించి ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పారు. అలాగే విక్కీ సోదరుడు సన్నీ కౌశల్ కూడా కత్రినా తో ఉన్న ఫోటోను షేర్ చేసాడు. కత్రినా కైఫ్ హంకాంగ్ లో జూలై 16, 1983లో జన్మించింది. ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. బ్రిటిష్ పౌరసత్వం కలిగిన ఈ బాలీవుడ్ భామకు ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్ ఉంది. కత్రినా సౌత్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా... తన గ్లామర్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడిపిన కత్రినా 2021 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఖరీదైన డిజైనర్ వేర్స్ ధరించి వధూవరులు మెరిసిపోయారు. అయితే వివాహానికి ముందు కత్రినా పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. సల్మాన్, రన్బీర్ కపూర్, అక్షయ్ కుమార్ లతో కత్రినా డేటింగ్ చేశారన్న రూమర్స్ ఉన్నాయి. ఇక బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో సైతం కత్రినా కలిసి కనిపించారు. వీరి మధ్య కూడా సీరియస్ ఎఫైర్స్ అంటూ వార్తలు వచ్చాయి.
ఆమె తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలలో నటించారు. బాలివుడ్ లో ఆమె చేసిన మైనే ప్యార్ క్యూ కియా, నమస్తే లండన్ వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అయితే అప్పట్లో ఆమె నటించిన సినిమాలు హిట్ అయినా ఆమె నటనకు మాత్రం విమర్శలే వచ్చాయి.కానీ 2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ సినిమాలో ఆమె నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు కత్రినా. ఆ తరువాత అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, రాజ్నీతీ , జిందగీ నా మిలేగీ దుబారా సినిమాల్లో నటించారామె. మేరే బ్రదర్ కీ దుల్హన్ తో సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకున్నారు. ఆ తరువాత ఆమె నటించిన ఏక్ థా టైగర్ , ధూమ్3 సినిమాలు అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆమె నటనకు ఇప్పటికీ కొన్ని సార్లు విమర్శలు వచ్చినా, చాలావరకు కమర్షియల్ గా విజయవంతమయ్యాయి.
Tags
- Vicky Kaushal
- Katrina Kaif
- Happy Birthday katrina
- Maldives
- katrina kaif birthday
- katrina kaif birthday in maldives
- katrina kaif
- katrina birthday
- katrina birthday in maldives
- katrina kaif birthday 2022
- katrina birthday video
- katrinakaif birthday in maldives
- katrina first birthday after wedding
- katrina kaif in maldives
- katrina birthday celebrations
- vicky katrina birthday celebrations
- katrina kaif birthday celebration
- katrina vicky birthday
- karina kaif birthday celebration
- katrina vicky first birthday
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com