Kerala: లైంగిక దాడి కేసులో స్టే ఉపసంహరణ

Kerala: లైంగిక దాడి కేసులో స్టే ఉపసంహరణ
X
2018లో మళయాళీ నటుడు ఉన్ని ముకుందన్ పై నమోదైన లైంగిక దాడి కేసు; కేసుపై స్టే జారీ; లాయర్ పై ఆరోపణలు; స్టే ఉపసంహణ

మళయాళీ నటుడు ఉన్ని ముకుందన్ పై 2018లో నమోదైన లైంగిక దాడి కేసు మరో మలుపు తిరిగింది. గతంలోనే ఈ కేసులో స్టే విధించిన హై కోర్టు... తాజాగా దాన్ని ఉపసంహిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముకుందన్ కు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసిన మహిళ తాను ఎటువంటి సెటిల్మెంట్ పత్రాలపై సంతకాలు చేయలేదని కోర్ట్ కు తెలపడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ముకుందన్ తరఫు న్యాయవాది కేరళ హైకోర్ట్ న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడు అయిన సైబీ జోస్ ఈ కేసు నుంచి తప్పుకున్నారు. కేసు సెటిల్మెంట్ నిమిత్తం క్లైంట్ ల వద్ద నుంచి లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలతో సైబీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈమేరకు అతడిపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ వింగ్ దర్యప్తు చేసి అందుకో కొన్ని నిజమేనని తేల్చింది.

ఇక గతంలో ఉన్ని ముకుందన్ కేసులోనూ సైబీనే స్వయంగా క్లైంట్ కోర్టు వెలుపల సెటిల్మెంట్ కు అంగీకరిస్తూ సంతకాలు చేసిన పత్రాలను కోర్టుకు సమర్పించాడు. అయితే తాజాగా ఆమె అందుకు నిరాకరించడంతో సైబీ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు న్యాయస్థానానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

2017లో ముకుందన్ పై ఓ మహిళా స్క్రిప్ట్ రైటర్ లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు ైల్ చేసింది. ఆగస్టులో అతడి స్వగృహంలో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ లో ముకుందన్ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. అనంతరం ముకుందన్ సైతం ఆమె స్క్రిప్ట్ పూర్తి చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమెకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశాడు. మరి తాజా పరిణామాలతో ముకుందన్ సినీ ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.



Tags

Next Story