Kerala: ప్రభుత్వం నిర్మించిన సినిమా... 'డైవర్స్'...

Kerala: ప్రభుత్వం నిర్మించిన సినిమా... డైవర్స్...
మహిళా దర్శకులను ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త పథకం; చిత్ర నిర్మాణానికి నిధులు మంజూరు; తొలి సినిమాగా బయటకు వచ్చిన "డైవర్స్"

కేరళ ప్రభుత్వం మరో సంచలనాత్మాక నిర్ణయంతో ముందడుగు వేసింది. మహిళా దర్శకులకు సినిమాలు తీసేందుకు నిధులు కేటాయిస్తూ సరికొత్త బోర్డ్ ను ఏర్పాటు చేసింది. కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఏర్పాటైన ఈ బోర్డ్ ద్వారా ఇప్పటికే ఇరువురు మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసింది. తాజాగా అలా ఎంపికైన వారిలో ఐజీ మిని డైవర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం నిర్మించిన తొలి సినిమాగా డైవర్స్ రికార్డులకు ఎక్కబోతోంది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక దర్శకురాళ్ల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారిలో ఇద్దరిని ఎంపిక చేసి, వారి ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించనున్నారు. ఎంపికైన వారిలో ఒక్కొక్కరికీ రూ. కోటిన్నర నిధుల విడుదల చేయనున్నారు. అయితే 2019లోనే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తవ్వగా కోవిడ్ వల్ల మినీ రూపొందించిన సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story