Kerala: నటిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి బైలు నిరాకరణ

Kerala: నటిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి బైలు నిరాకరణ
X
కేసులో ప్రధాన నిందితుడి బెయిల్ పిటిషన్ పై స్పందించిన కేరళ హై కోర్జు; బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ

కేరళ నటిపై కారులో లైంగిక దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీల్ ఆరేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిందితుడు అర్జీ పెట్టుకున్న బైలు పిటిషన్ ను తోసిపుచ్చుతూ కేరళ హైకోర్డు తీర్పు వెలవరించింది. అతడికి బైలు ను నిరాకరించింది. ఏక న్యాయ నిర్ణేత జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. గత ఆరేళ్లుగా పల్సర్ సునీల్ నటిపై లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. మార్చి 2022లో బెయిల్ కోసం సునిల్ హైకోర్టును ఆశ్రయించగా అప్పుడే కోర్టు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన సునీల్ కు అక్కడ కూడా చుక్కెదురైంది. మరోసారి హై కోర్డులోనే పిటిషన్ వేయాల్సిందిగా సూచించింది. 2017లో కేరళకు చెందిన ప్రముఖ నటీమణి కిడ్నాప్ కు గురై, ఆపై నడుస్తున్న కారులోనే లైంగిక దాడికి గురైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పల్సర్ సునీల్ ప్రధాన నిందితుడుకాగా, మళయాళీ నటుడు దిలీప్ ను 8వ నిందితుడిగా కోర్డులో హాజరుపరిచారు. సుమారు 10మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.


Tags

Next Story