Khan Meets Pushpa: మిస్టర్ పర్ఫెక్షనిస్టుకు పుష్పా ఘనస్వాగతం

Khan Meets Pushpa: మిస్టర్ పర్ఫెక్షనిస్టుకు పుష్పా ఘనస్వాగతం
ఆమిర్ ఖాన్ కోసం ఎయిర్ పోర్ట్ కు కారు పంపిన అల్లు అర్జున్; అక్కడి నుంచి నేరుగా బన్నీ ఇంటికి చేరుకున్న ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కు హైదరాబాద్ విమానాశ్రయంలో అనుకోని స్వాగతం లభించింది. ఆమిర్ ఖాన్ రాక గురించి ముందే తెలుసుకున్న అల్లు అర్జున్ కారుతో పాటూ కొంత మంది సిబ్బందిని పంపి ఆయనకు ప్రత్యేక ఎస్కార్ట్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు అదే కారులో ఆమిర్ నేరుగా జూబ్లీహిల్స్ లోని అల్లు వారింటికి చేరుకోవడం మరో విశేషం. ఆమిర్ ఖాన్ కు రాచ మర్యాదల సంగతి పక్కన పెడితే ఇద్దరూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం పెద్ద స్కెచ్ వేసే పనిలోనే ఉన్నారా ఏంటన్న ఆలోచన మొదలైంది. ఇటీవలే డేట్లు సర్దుబాటు చేయలేక షారుఖ్ ఖాన్ జవాన్ నుంచి బన్నీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బడా ఖాన్ తో బన్నీ భేటీ అవ్వడం ఇంకో ప్రాజెక్ట్ కు బాటలు వేసేట్టు కనిపిస్తోంది. అయితే బన్నీ, ఆమిర్ బంధం నేటిది కాదని తెలిసినవారు మాత్రం కాస్త నిమ్మళంగానే ఉన్నారు. అల్లు వారి కుటుంబంతో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కు ముందు నుంచే మంచి అనుబంధం ఉంది. మరి తాజా కలయిక వ్యక్తిగతమైనదా లేక వృత్తిగతమైనదా అన్నది తెలియాల్సి ఉంది.


Tags

Read MoreRead Less
Next Story