Kiara-Sid wedding: కియారాకు చెర్రీ సప్రైజ్...
కియారా సిద్ధార్ధ్ పెళ్లి హాడావిడి ముగిసినా... చూడ ముచ్చటైన జంటకు అన్ని వైపుల నుంచీ ఇంకా శుభాభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇటీవలే ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సెలబ్రిటీలు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో ఆర్సీ 15 టీమ్ కు ఆహ్వానం వెళ్లినా షూటింగ్ మధ్యలో ఎవరూ దానికి హాజరవ్వలేకపోయారు. ఈ క్రమంలో చిత్ర బృందానికి ఓ బృహత్తరమైన ఐడియా వచ్చింది. డైరెక్టర్ నుంచి స్పాట్ బాయ్ వరకూ అందరూ ఏకమై సిడ్-కియారాకు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో డైనమిక్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యతో పాటూ ఇతర యూనిట్ సభ్యులు కూడా ఉండటం విశేషం. ఇక ఈ వీడియోను కియారాకు పంపగా అమ్మడు ఎంతో మురిసిపోయిందిట. అందుకే ఆ వీడియోను తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసి అందరికీ పేరుపేరుగా ధన్యవాదాలు చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com