K.L. Rahul : అక్కడే ఒక్కటవ్వనున్నారు....

భారత క్రికెటర్ K.L.రాహుల్ అథియా శెట్టిల పెళ్లి ఈ నెల 23న జరగనుంది. ఈ ముచ్చటైన జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని దానిని చూసేందుకు అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. వారి పెళ్లి ఎక్కడ జరుగుతుందోనని అందరూ అనుకుంటున్నారు. వారి పెళ్లి చాలా ఘణంగానే జరుగుతుందని అథియా శెట్టి తండ్రి బాలివుడ్ నటుడు సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌజ్‌లో జరుగుతుందని దీనికి అన్ని విధాల ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌజ్ లో ఫోటొలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయితున్నాయి. వాటిని చూస్తుంటే పెళ్లి తప్పకుండా ఇక్కడే జరుగుతుందని, చాలా విశాలంగా ఉందని పెళ్లి చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలుస్తుంది. విశాలమైన బెడ్‌రూమ్ లు, స్విమ్మింగ్‌పూల్, బంగ్లా చూస్తుంటే రెండు కళ్లు చాలవు అనే రీతిలో ఉన్నాయి. పెళ్లికి వచ్చిన ముఖ్యమైన వారికి సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఆ ఫామ్ హౌజ్‌లో ఉన్నాయి. కానీ రాహుల్,అథియా పెళ్లి ఎక్కడ జరుగుతుందన్న విషయంపై మాత్రం సునీల్ ఫ్యామిలి ఇప్పటికి నోరు విప్పలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com