Kollywood: పండండి బిడ్డకు జన్మనిచ్చిన ఆట్లీ దంపతులు

Kollywood: పండండి బిడ్డకు జన్మనిచ్చిన ఆట్లీ దంపతులు
X
డిసెంబర్ లో తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించిన ఆట్లీ దంపతులు; జనవరి 31న బుజ్జాయికి జననం...

కోలీవుడ్ కుర్ర డైరెక్టర్ ఆట్లీ తండ్రి అయ్యాడు. భార్య ప్రియా మోహన్ జనవరి 31న పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఇరువురి ఆనందానికి అవధులే లేవు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'వాళ్లు నిజమే చెప్పారు, ప్రపంచంలో ఇలాంటి అనుభూతి మళ్లీ మళ్లీ కలగదంటూ" ట్వీట్ చేశారు. అందులో భాగంగానే మా చిన్ని కన్నయ్య మా జీవితాల్లోకి వచ్చేశాడు అంటూ హృద్యమైన పోస్ట్ ను షేర్ చేశారు. తల్లిదండ్రులుగా అత్యంత సాహసోపేతమైన ప్రయాణం మొదలవ్వబోతోందని రాసుకొచ్చారు. ఇక వీరి ట్వీట్ కు కోలీవుడ్ సెలబ్రిటీల నుంచి రిప్లైలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య, వరలక్ష్మీ శరత్ కుమార్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Next Story