Kollywood: 14ఏళ్ల తరువాత మళ్లీ జంటగా...

లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇళయదళపతి విజయ్ 67వ చిత్రం రోజురోజుకూ మరింత భారీతనాన్ని సంతరించుకుంటోందనే చెప్పాలి. క్యాస్టింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్, నిర్మాణ విలువలు ఇలా అన్నింటా భారీతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవలే సంజయ్ దత్ సినిమా టీమ్ లో జాయన్ అవ్వగా, ఇప్పటికే అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్సెకిన్ వంటి సుప్రసిద్ధ నటీనటులతో క్యాస్టింగ్ ఓ వెలుగువెలిగిపోతోంది. తాజాగా వీరి సరసన త్రిష పేరు కూడా చేరడంతో జనాల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. విజయ్ సరసన లీడింగ్ లేడీగా త్రిష పేరు ఖారారు అయింది. అయితే వీరి ఇరువురూ సుమారు 14ఏళ్ల తరువాత కలసి నటిస్తుండటం విశేషం. 7 స్క్రీన్ స్టూడియో పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరెక్కుతున్న ఈ చిత్రానికి లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పళనిస్వామి సహ-నిర్మాతగా బాధ్యతలు నిర్వహించనున్నారు. రాక్ స్టార్ అనిరుథ్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందించనున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతను తీసుకోనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే విడుదలకానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com