Chandramukhi 2: 'చంద్రముఖి 2'లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరూ ఊహించని విధంగా..

Chandramukhi 2: చంద్రముఖి 2లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరూ ఊహించని విధంగా..
Chandramukhi 2: చంద్రముఖి 2లో హీరోయిన్ త్రిష అని రూమర్స్ వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ ఛాన్స్ అప్‌కమింగ్ నటికి దక్కింది

Chandramukhi 2: చంద్రముఖి అనే సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారర్ సినిమాలంటే కొందరు దర్శకులు మాత్రమే తెరకెక్కించగలరు అనుకుంటున్న సమయంలో చంద్రముఖి చిత్రంతో హారర్ సినిమాల్లో ఓ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు దర్శకుడు పి వాసు. 2005లో విడుదలయిన ఈ సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరూ అనేదానిపై కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

చంద్రముఖి సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ ఎంత ముఖ్యమైనదో తెలిసిందే. ఆ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసే పాత్రలో కనిపించింది జ్యోతిక. ఇక నయనతార కూడా ఒక కీ రోల్‌లో కనిపించింది. కానీ చంద్రముఖి 2లో వీరిద్దరూ ఉండబోరని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ముందుగా వారి స్థానంలో త్రిషను అనుకున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఓ అప్‌కమింగ్ నటి ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని సమాచారం.

లక్ష్మీమీనన్‌.. ఈ పేరు కోలీవుడ్‌లో వినిపించి చాలాకాలమే అయ్యింది. చిన్న వయసులోనే హీరోయిన్‌గా 'కుంకీ' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అనూహ్యంగా పెద్ద హిట్ అయ్యింది. దీంతో తనకు వరుసగా పెద్ద హీరోలతో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ తన పరీక్షల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన లక్ష్మీ మీనన్.. ఇప్పటివరకు రీ ఎంట్రీ ఇవ్వలేదు. కానీ చంద్రముఖి 2తో తన రీ ఎంట్రీ ఉండబోతుందని కోలీవుడ్‌లో న్యూస్ వైరల్ అయ్యింది.



Tags

Read MoreRead Less
Next Story