Madonna Biopic: ఇన్స్టాలో విపరీత చేష్ఠలు... ఆగిపోయిన బయోపిక్

Madonna Biopic: ఇన్స్టాలో విపరీత చేష్ఠలు... ఆగిపోయిన బయోపిక్
పాప్ క్వీన్ మడోన్నా బయోపిక్ ను నిలిపివేసిన యూనివర్శల్ స్టూడియోస్; ఇన్స్టాలో ఆమె విపరీత చేష్ఠలకు విసిగిపోయిన చిత్ర బృందం...

తన పాటలతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే పాప్ క్వీన్ మడోన్నా వయసు మీద పడుతున్న కొద్దీ మరింత అందాన్ని సంతరించుకుంటుందనే చెప్పాలి. అయితే, అది హుందాతనాన్ని తీసుకురావాల్సింది పోయి, వెర్రితనాన్ని తలపిస్తోంది. ఆ మధ్య యూనివర్శల్ స్టూడియోస్ మడోన్న బయోపిక్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పలు ఆడిషన్స్ ను నిర్వహించి జూలియా గార్నర్ అనే నటిని కూడా ఎంపిక చేశారు. మడోన్నానే స్వయంగా ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించింది. అతి క్లిష్టమైన కొరియోగ్రఫీ, సాంగ్ ఆడిషన్స్ తో కూడిన ఈ ఎంపిక ప్రక్రియ అప్పట్లోనే వార్తలకు ఎక్కింది. ఒకానొక సమయంలో ఈ సినిమాను కూడా మడోన్నానే డైరెక్టర్ చేయబోతోంది అన్న ముచ్చట కూడా వినిపించింది. అయితే ప్రస్తుతం ఇదంతా తలకిందులు అయింది. యూనివర్శల్ స్టూడియోస్ 64 ఏళ్ల పాప్ క్వీన్ బయోపిక్ ను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసుకుని మడోన్నా నుంచి ఫైనల్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆమె అసలు ఈ సంగతినే పట్టించుకోవడం మానేసిందట. పైగా ఈ మధ్య ఇన్స్టాలో ఆమె యాక్టివిటీ కూడా ఎక్కువైంది. రకరకాల ఫోజుల్లో విపరీత ధోరణులకు పోతున్న మడోన్నా ఇన్స్టాలో పిచ్చి ఫొటోలు పెడుతూ తన పరువు తానే తీసుకోవడం ఆరంభించింది. ఓ ఏడాది పాటూ ఈ తంతును పరిశీలించిన యూనివర్శల్ బృందం ఇక ఈమెతో పని జరగదని ఫిక్స్ అయిపోయారు. అందుకే ఆమె బయోపిక్ ను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరి దీనిపై పాప్ క్వీన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story