Manchu Lakshmi : ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి : మంచు లక్ష్మి
Manchu Lakshmi : మంచు లక్ష్మీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినీ విలేఖరులు ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా ఆమెను మంచు మనోజ్ రెండో వివాహం గురించిన మంచు లక్ష్మిని ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం చెప్తూ.. 'ఎవరి బతుకును వాళ్లను బతకనివ్వండి.. ఈ రోజుల్లో స్వఛ్ఛమైన ప్రేమను దొరకడం చాలా కష్టం.. మనోజ్‌కు ఆ ప్రేమ ప్రస్తుతం దక్కబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను.
ఇక మరో సోదరుడు విష్ణుపై వస్తున్న ట్రోల్స్ విమర్శల గురించి కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. మంచు విష్ణు 'మా' అధ్యక్షుడు అయినప్పటి నుంచి ట్రోల్స్ దారుణంగా పెరిగాయన్నారు. రాజకీయంలో మంచితో పాటు చెడును కూడా ఆహ్వానించాలి. విష్ణు నెగిటివిటీని ఆహ్వానించాలంటే కొంత సమయం పడుతుంది అని అన్నారు మంచు లక్ష్మీ ప్రసన్న.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com