పెళ్లి పీఠలెక్కబోతున్న మెగా ప్రిన్స్, అందాల రాక్షసి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్లి పీఠలెక్కబోతున్నారు. వీరిద్దరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. త్వరలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ చేసుకుంటారని.. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి జరపాలని ఇరువైపు కుటుంబాలు నిర్ణయించాయి.
వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. ఇపుడు ఈ నయా టాలీవుడ్ జంట ప్రేమ పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ పెళ్లితో ఒక్కటవుతున్నారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది.
లావణ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకే వరుణ్ తేజ్ బెంగళూరు వెళ్లాడంటూ అప్పట్ పుకార్లు షికారు చేసాయి. ఈ వార్తలపై మెగా కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే లావణ్య త్రిపాటి మాత్రం స్పందించింది. తాను బెంగళూరులో లేనని, తన సొంతూరు డెహ్రాడూన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నానంటూ అక్కడి ఫొటోలను షేర్ చేసింది. ఇపుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలు టాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com