Michael Jackson Biopic: తమ్ముడి కొడుకే హీరో....

కింగ్ ఆఫ్ పాప్ గా ప్రసిద్ధిగాంచిన మైఖెల్ జాక్సన్ బయోపిక్ కు రంగం సిద్ధమైంది. ఆంటోనీ ఫుకా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బయోపిక్ కు మైఖెల్ అన్న టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే పాప్ కింగ్ పాత్ర ఎవరు చేయబోతున్నారు అన్న అంశంపై సాగిన మీమాంశకు ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర బృందం జాఫర్ జాక్సన్ పేరును ప్రకటించింది. వారు పేరు అనౌన్స్ చేయడం ఆలస్యం జాఫర్ పేరు వైరల్ గా మారింది. అసలు ఎవరీ జాఫర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ కుర్రాడు మరెవరో కాదు, మైఖెల్ జాక్సన్ తమ్ముడు జెరామిన్ జాక్సన్ కొడుకే. జెరామిన్ రెండో సంతానమైన జాఫర్ తప్పితే ఈ పాత్రకు మరెవ్వరూ న్యాయం చేయలేరని భావిస్తున్నాని దర్శుకుడు తన ఇన్స్టా పోస్ట్ ద్వారా వెల్లడించాడు. 26ఏళ్ల జాఫర్ కూడా పెద్దనాన్న బాటలోనే చిన్నతనంలోనే మైక్ ను అందిపుచ్చుకున్నాడు. 12ఏళ్ల వయసులో సామ్ కూకే, మార్విన్ గాయే వంటి పాప్ స్టార్స్ గీతాలకు కవర్ సాంగ్స్ చేశాడు. అనంతరం తన సొంత పాటలు కంపోజ్ చేసుకుంటూ పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన జాఫర్ పెద్దనాన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పాప్ కింగ్ ఫ్యాన్స్ ను అలరించేందుకు వస్తున్నానని తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com