Mike Tyson: అప్పుడు చేతికర్ర.. ఇప్పుడు వీల్ చైర్.. మైక్ టైసన్‌కు ఏమైంది..?

Mike Tyson: అథ్లెట్స్ అనేవారు ఎంత ఫిట్‌నెస్‌ను మెయింటేయిన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వయసు పైబడుతున్న కొద్దీ వారిలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరిపై ఆ ఆరోగ్య సమస్యలు చాలా ఎఫెక్ట్ ఇస్తాయి కూడా. ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్‌గా పేరు తెచ్చుకున్న బాక్సర్ మైక్ టైసన్‌ను చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. ఇటీవల ఎయిర్‌పోర్టులో వీల్ చైర్‌లో కనిపించారు మైక్.
మైక్ టైసన్.. కొన్నాళ్ల క్రితం చేతికర్ర సాయంతో నడుస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే ఏదైనా గాయం అయ్యిందేమో అందుకే చేతికర్ర సాయం తీసుకుంటున్నారేమో అని అభిమానులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఆయనను వీల్ చైర్‌పై చూసేసరికి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటో ఆరాతీయడం మొదలుపెట్టారు.
మైక్ టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా వ్యాధితో బాధపడుతున్నారట. అందుకే డాక్టర్లు టైసన్‌ను వీల్ చైర్ వాడాలని సూచించారట. అంతే కాకుండా టైసన్ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడుతుందని అనడం అందరినీ మరింత ఆందోళనకు గురిచేసింది. ఒకప్పుడు బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలిన టైసన్.. ఇలా అయిపోవడమేంటి అని అభిమానులు వాపోతున్నారు.
Mike Tyson is pictured in a wheelchair at Miami Airport, raising new fears for his health amid problems with sciatica, just weeks after he morbidly claimed his death is 'coming really soon' at 56
— ImageKingUSA (@ImageKingUSA1) August 16, 2022
via https://t.co/iDmtTZl3Op https://t.co/rkBeXrNHE8
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com