‘మిషన్ తషాఫి’ షూటింగ్ ప్రారంభం

‘మిషన్ తషాఫి’ షూటింగ్ ప్రారంభం
ఓటీటీ మాధ్య‌మాల్లో పేరుగాంచిన కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో జీ 5 ఒకటి

ఓటీటీ మాధ్య‌మాల్లో పేరుగాంచిన కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో జీ 5 ఒకటి. ఇప్పుడు స‌రికొత్త యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్‌తో ఆక‌ట్టుకోవ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. యాక్ష‌న్ థ్రిల్లింగ్ చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్న దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు. అయితే అతని దర్శకత్వంలోనే ఈ వెబ్‌సిరీస్‌ కూడ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‌లో పూర్తిగా 8 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిప‌బ్లిక్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మిస్తున్నారు.

తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ‌ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించని స‌రికొత్త లొకేష‌న్స్‌లో ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు మేకర్స్‌. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్‌టెన్స్ యాక్ష‌న్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ‌ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించని స‌రికొత్త లొకేష‌న్స్‌లో ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించ‌బోయే న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజిన‌ల్ రెగ్యుల‌ర్ షూటింగ్ శ‌నివారం నుంచి ప్రారంభ‌మైందని బృదం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story