Mohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Mohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..
X
Mohanlal: జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్ మాలీవుడ్‌లో సూపర్ హిట్.

Mohanlal: మలయాళ సినిమాలు ఫీల్ గుడ్ స్టోరీతో పాటు థ్రిల్లర్‌ను కూడా అందించగలవని ఇప్పటికీ చాలాసార్లు నిరూపించాయి. ఇక ఆ థ్రిల్లర్ జోనర్‌కు మాలీవుడ్‌లో దిట్ట డైరెక్టర్ జీతూ జోసెఫ్. తను తెరకెక్కించినవి ఎక్కువశాతం థ్రిల్లర్ సినిమాలే. అందులోనూ ఒకటి కూడా లెక్క తప్పలేదు. ఇక మరోసారి తన హిట్ ఫ్రాంచైజ్‌లో మరో సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు జీతూ జోసెఫ్.

జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్ మాలీవుడ్‌లో సూపర్ హిట్. వీరి కాంబోలో వచ్చిన 'దశ్యం', 'దృశ్యం 2' అయితే మాలీవుడ్‌లో థ్రిల్లర్ సినిమాలలో టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అంతే కాకుండా ఇవి ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతీ భాషలో ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వడం విశేషం. తెలుగులో ఈ రెండు సినిమాల్లో వెంకటేశే హీరోగా నటించాడు.

ఇక ఇదే దారిలో దృశ్యం 3 కూడా ఉండనుందని దర్శకుడు ఎప్పుడో వెల్లడించాడు. కానీ దానికి కథ పర్ఫెక్ట్‌గా రాయాలంటే సమయం పడుతుందని కూడా అన్నాడు. ఇంతలోనే దృశ్యం 3 ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. 'దృశ్యం 3 ది కంక్లూజన్' పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ఫస్ట్ లుక్‌లో మోహన్ లాల్ చేతికి సంకెళ్లు వేసి ఉండడం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Tags

Next Story