Nagin: చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన "నాగిని"

నాగిని టీవీ సీరియల్ ఫేమ్ మెహెఖ్ చాహల్ తీవ్ర అస్వస్థతకు గురైంది. జనవరి మొదటి వారంలో తీవ్రమైన ఛాతి నొప్పితో ఆసుపత్రి పాలైనట్లు నటి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. చాలా రోజులు వెంటిలేషన్‌పైనే ఉన్నాట్లు పేర్కొంది. నిమోనియా కారణంగా చావు అంచుల వరకూ వెళ్లి వచ్చినట్లు వెల్లడించింది. డిసెంబర్‌లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది.
తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. అందులో జనవరిలో చాతిలో నొప్పి మొదలవ్వగా, ఆక్సీజన్ లెవెల్స్ దిగువ స్థాయికి చేరుకున్న వైనాన్ని చెప్పుకొచ్చింది. లక్షణాలు పూర్తిగా కోవిడ్ కు సంబంధించినవిగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపింది ఛాహెల్. నిమోనియా అని నిర్థారణ అవ్వడంతో ఆసుపత్రిలోనే అడ్మిట్ అయినట్లు తెలిపింది. ఏమైనా మెహక్ ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com