Nassar: సినిమాల నుండి సీనియర్ నటుడు రిటైర్‌మెంట్..! కారణం ఏంటంటే..?

Nassar: సినిమాల నుండి సీనియర్ నటుడు రిటైర్‌మెంట్..! కారణం ఏంటంటే..?
Nassar: సౌత్ సినిమాల్లోనే కాదు పలు హిందీ చిత్రాల్లో కూడా నాజర్ నటించి మెప్పించారు.

Nassar: ఇప్పటికీ సినీ పరిశ్రమ ఎంతోమంది సీనియర్ నటులను కోల్పోయింది. మరికొందరు మాత్రం ఇష్టపూర్వకంగానే సినిమాలకు, యాక్టింగ్‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా మరో సీనియర్ నటుడు కూడా సినిమాల నుండి రిటైర్‌మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆయనే నాజర్. ఎన్నో సినిమాల్లో, వైవిధ్యభరిమైన పాత్రలతో మెప్పించిన నాజర్.. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందట.

సౌత్ సినిమాల్లోనే కాదు పలు హిందీ చిత్రాల్లో కూడా నాజర్ నటించి మెప్పించారు. ఇక 'బాహుబలి'లో నాజర్ చేసిన బిజ్జలదేవ పాత్రను.. ఆయన మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. 'కళ్యాణ అగత్తిగళ్' చిత్రంతో మొదలయిన నాజర్ సినీ ప్రస్థానం చివరిదశకు చేరుకుందని కొందరు అంటున్నారు. నాజర్ ఇష్టపూర్వకంగానే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

లాక్‌డౌన్ సమయంలో పలు గుండె సంబంధిత వ్యాధుల వల్ల బాధపడ్డారట నాజర్. దీంతో ఆయన ఇక సినిమాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై నాజర్ కానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగానూ స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. సినీ పరిశ్రమలో మరో గొప్ప నటుడిని మిస్ అవుతామని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Tags

Read MoreRead Less
Next Story