2 July 2022 1:00 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Nassar: సినిమాల నుండి...

Nassar: సినిమాల నుండి నాజర్ రిటైర్‌మెంట్.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

Nassar: సౌత్ సినిమాల్లోనే కాదు పలు హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ నాజర్.

Nassar: సినిమాల నుండి నాజర్ రిటైర్‌మెంట్.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
X

Nassar: సౌత్ సినిమాల్లోనే కాదు పలు హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ నాజర్. ఇక 'బాహుబలి'లో నాజర్ చేసిన బిజ్జలదేవ పాత్రను.. ఆయన మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. 'కళ్యాణ అగత్తిగళ్' చిత్రంతో మొదలయిన నాజర్ సినీ ప్రస్థానం చివరిదశకు చేరుకుందని కొందరు అంటున్నారు. కొన్నిరోజులుగా ఈ వార్తలు వైరల్ అవుతుండగా నాజర్ వీటిపై స్పందించారు.

ప్రస్తుతం తండ్రి పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ నాజర్.. సౌత్‌లో మాత్రమే కాదు నార్త్‌లో కూడా బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో పలు గుండె సంబంధిత వ్యాధుల వల్ల బాధపడ్డారట నాజర్.. అందుకే సినిమాల నుండి రిటైర్‌మెంట్ తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ నాజర్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు.

'నా ఊపిరి ఉన్నంతవరకు సినిమాల్లోనే' అంటూ నాజర్ వెల్లడించారు. దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉంటారన్న వార్తలకు చెక్ పడింది. ఎప్పటిలాగానే ఆయన సినిమాల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తూ ఉంటారని క్లారిటీ వచ్చేసింది.


Next Story