Home
 / 
సినిమా / సమస్తం / Nayan Vignesh : నయన్...

Nayan Vignesh : నయన్ విఘ్నేష్ దంపతులకు కవల పిల్లలు..

Nayan Vignesh : తాము తల్లిదండ్రులైనట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు

Nayan Vignesh : నయన్ విఘ్నేష్ దంపతులకు కవల పిల్లలు..
X

Nayan Vignesh : నయనతార, విఘ్నేశ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ట్విన్స్‌ జన్మించినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు.. నయన్, విఘ్నేశ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సరోగసి పద్ధతిలో నయనతార, విఘ్నేశ్‌ అమ్మనాన్నలు అయ్యారు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దుపెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విఘ్నేశ్‌. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు.

ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మహాబలిపురంలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన డాక్యుమెంటరీ త్వరలోనే సందడి చేయనుంది. ఆ పెళ్లి సందడిని ఎప్పుడెప్పుడు చూస్తామా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నయన్, విఘ్నేశ్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Next Story