Nayanthara: త్వరలోనే నయన్, విగ్నేష్ పెళ్లి.. అందుకే కులదైవం ఆలయంలో..
Nayanthara: ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకుంటున్న నటీనటుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సీక్రెట్‌గా పెళ్లిని ప్లాన్ చేసుకుంటూ ఎన్నో ప్రేమజంటలు పెళ్లిపీటలెక్కుతున్నాయి. ఇక చాలాకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి గురించి కూడా ఇప్పటివరకు చాలాసార్లు రూమర్స్ వచ్చినా.. ఈసారి మాత్రం త్వరలోనే వారు పెళ్లికి సిద్ధమయినట్టు అనిపిస్తోంది.
'నానుమ్ రౌడీ థాన్' అనే చిత్ర షూటింగ్ సమయంలో నయనతార, విగ్నేష్ శివన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. దానిని విగ్నేష్ డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికే వీరి రిలేషన్ చాలా స్ట్రాంగ్‌గా మారింది. దాదాపు ఏడేళ్ల నుండి వీరి ప్రేమలో ఉన్నారు. అందుకే చాలాసార్లు వీరి పెళ్లి గురించి కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా నయనతార, విగ్నేష్.. తిరుమలలో పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా తాజాగా వీరిద్దరు తిరుమలకి వెళ్లి అక్కడ మండపాన్ని కూడా పరిశీలించినట్టు సమాచారం. అయితే పెళ్లిని కూడా వచ్చే నెలలోనే ప్లాన్ చేశారట. అందుకే వీరిద్దరు కులదైవం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
విగ్నేష్ సొంతూరు అయిన పాపనాశంలోని మేలమరుతరు గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వీరిద్దరు నేడు వెళ్లడం చూసి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని అందరూ భావిస్తున్నారు. ఇక నయన్, విగ్నేష్ పెళ్లి.. జూన్ లేదా ఆగస్టులో ఉండనున్నట్టు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com