21 July 2022 1:00 PM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Nayan Vignesh:...

Nayan Vignesh: నెట్‌ఫ్లిక్స్‌లో నయన్, విఘ్నేష్.. పోస్ట్‌తో క్లారిటీ..

Nayan Vignesh: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి సన్నిహితుల మధ్యలోనే జరిగినా చాలా గ్రాండ్‌గా జరిగింది.

Nayan Vignesh: నెట్‌ఫ్లిక్స్‌లో నయన్, విఘ్నేష్.. పోస్ట్‌తో క్లారిటీ..
X

Nayan Vignesh: నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి సన్నిహితుల మధ్యలోనే జరిగినా చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటివరకు విఘ్నేష్ పెట్టిన పలు సోషల్ మీడియా పోస్టులు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కానీ వీరిద్దరి పెళ్లి అసలు ఎలా జరిగిందో చూడాలని వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే నెట్‌ఫ్లిక్స్ డీల్ క్యాన్సిల్ చేసుకుందని.. వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ అవ్వదు అని రూమర్స్ వచ్చాయి. వీటన్నింటికి ఒక్క పోస్ట్‌తో సమాధానం చెప్పింది నెట్‌ఫ్లిక్స్.

నయన్, విఘ్నేష్ పెళ్లిపై కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ కూడా ఆసక్తి చూపించడంతో వీరి పెళ్లి వీడియోను స్ట్రీమ్ చేస్తే బాగుంటుంది అనుకుంది ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్. అందుకోసమే ఆ వీడియో రైట్స్‌ను రూ.25 కోట్లు పెట్టి కొనుక్కుందని సమాచారం. కానీ విఘ్నేష్ ఇప్పటికే పలు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్‌ఫ్లిక్స్ డీల్ క్యాన్సిల్ చేసుకుందని, నోటిసులు పంపిందని రకరకాల వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి.

తాజాగా నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని పోస్ట్‌తో క్లారిటీ వచ్చేసింది. ఇందులో వారి పెళ్లి వీడియోతో పాటు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ కూడా ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి డాక్యుమెంటరీగా విడుదలకు సిద్ధమయ్యింది. 'నయన్, విఘ్నేష్ నెట్‌ఫ్లిక్స్‌కు రావడంతో మేము హ్యాపీ డ్యాన్స్ చేస్తున్నాం. వేచి చూడండి ఇది ఫెయిరీ టెయిల్‌కంటే బాగుంటుంది' అని నెట్‌ఫ్లిక్స్ వీరి ఫోటోలతో షేర్ చేసింది.


Next Story