Nayan Vignesh: శ్రీవారిని దర్శించుకున్న కొత్తజంట.. తిరుమలలో నయన్ దంపతుల సందడి..

Nayan Vignesh: ఎక్కువమంది సెలబ్రిటీలను ఆహ్వానించకుండా, పెద్దగా ప్రచారం లేకుండా.. కేవలం కుటుంబ సభ్యలు, స్నేహితుల సమక్షంలోనే నయనతార, విగ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగిపోయింది. వీరి పెళ్లి గురించి ఈ జంట అధికారికంగా ప్రత్యేకంగా ప్రకటించకపోయినా.. విగ్నేష్ మాత్రం ఎప్పటికప్పుడు పెళ్లి విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చాడు. ఇక పెళ్లి అయిన వెంటనే వారు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లారు.
నయనతార, విగ్నేష్ పెళ్లి గురించి వార్తలు బయటికి వచ్చినప్పుడు.. వీరిద్దరూ తిరుమలలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం సాగింది. అంతే కాకుండా పెళ్లి కోసం ఏర్పాటు చేసిన మండపాన్ని కూడా వీరు ఫైనల్ చేసినట్టు టాక్ వినిపించింది. కానీ చెన్నైలోనే ఓ స్టార్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. అయినా కూడా పెళ్లి అయిన తర్వాత రోజే సెంటిమెంట్‌తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ కొత్తజంట.
విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఇప్పటివరకు నయనతార రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటైన 'కాతువాకుల రెండు కాదల్' ఇటీవల విడుదలయ్యి మంచి టాక్‌నే సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయం నుండే వీరి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. జూన్ 9న వివాహం చేసుకోవాలని వీరిద్దరూ ఎప్పుడో నిర్ణయించుకున్నా.. అది బయటపడడానికి మాత్రం కాస్త సమయం పట్టింది. ఇక పెళ్లి తర్వాత విగ్నేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com