Nayanthara Vignesh: నయన్, విగ్నేష్ పెళ్లి కార్డు రెడీ.. సోషల్ మీడియాలో వైరల్..
Nayanthara Vignesh: ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీలు సంఖ్య ఎక్కువయ్యింది. అందులోనూ అవి చాలావరకు లవ్ మ్యారేజ్‌లు కావడం విశేషం. అలాగే కోలీవుడ్‌లో నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి గురించి కూడా ఎంతోకాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా వీరి పెళ్లి పత్రికగా ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. ప్రొఫెషనల్ పరంగానే కాదు.. పర్సనల్‌గా కూడా నయనతార చుట్టూ చాలా కాంట్రవర్సీలే ఉండేవి. కానీ గతకొంతకాలంగా అన్నింటికి దూరంగా ఉంటూ కేవలం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది నయన్. ఏడేళ్ల క్రితం విగ్నేష్ శివన్ అనే దర్శకుడితో ప్రేమలో పడిన నయన్.. తనతో చట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది.
ఇక ఏడేళ్లుగా ప్రేమపక్షులుగా ఉన్న నయనతార, విగ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్నట్టు ఈమధ్య జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరు తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపించినా.. అది నిజం కాదని తేలిపోయింది. జూన్ 9న మహాబలిపురంలోని మహబ్ హోటల్‌లో నయన్, విగ్నేశ్ పెళ్లి జరగనుంది. అంతే కాకుండా ప్రస్తుతం వీరి వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com