Nayanthara: నయన్ మెడపై కొత్త టాటూ.. ఫోటో వైరల్..

Nayanthara: ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్.. జూన్ 9న పెళ్లితో ఒకటయ్యారు. కెరీర్ పరంగా చూసుకుంటే నయనతార ప్రస్తుతం సౌత్‌లో చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్న వీరు మాత్రం పర్సనల్ లైఫ్ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటీవల ఓ ట్రిప్‌క బయల్దేరుతున్న సమయంలో నయన్ ఒంటిపై ఉన్న కొత్త టాటూను నెటిజన్లు గుర్తించారు.
నయనతార, విఘ్నేష్ పెళ్లయిన వెంటనే థాయ్‌లాండ్‌కు హనీమూన్‌కు వెళ్లారు. అక్కడి నుండి వచ్చిన వెంటనే వరుస కమిట్‌మెంట్స్ కారణంగా నయనతార షూటింగ్స్‌లో బిజీ అయిపోయింది. అయినా వెంటనే ఇప్పుడు స్పెయిన్ ట్రిప్‌ను ప్లాన్ చేసింది ఈ కొత్తజంట. అక్కడ వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలను విఘ్నేష్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా తను పోస్ట్ చేసిన నయనతార ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
స్పెయిన్‌లో రొమాంటిక్ పోజులతో ఈ జంట.. ఎప్పటికప్పుడు నెటిజన్లను అలరిస్తూనే ఉంది. ఇక షార్ట్ డ్రెస్‌లో నయన్ చేసిన ఫోటోషూట్ కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దాంతో పాటు తనకు సంబంధించిన మరో విషయం కూడా వైరల్ అవుతోంది.
నయనతారకు టాటూలు అంటే ఇష్టం. ఒకప్పుడు తను ప్రేమించిన ప్రభుదేవ పేరును టాటూ వేయించుకుంది ఈ భామ. ఆ తర్వాత వీరిద్దరికి బ్రేకప్ అవ్వడంతో ఆ టాటూను మార్చేసింది. ఇప్పుడు నయన్ మెడపై ఓ కొత్త టాటూ కనిపించింది. ఇది ముందు నుండి ఉందా? అసలు దీని అర్థమేంటి? అని నెటిజన్లు సందిగ్ధంలో పడ్డారు. అంతే కాకుండా ఈ టాటూ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Damnnnn #nayanthara has a neck tattoo😍😍🤤🤤🔥🔥 pic.twitter.com/CqKFUR6tSs
— Dr. Sush (@Sushmithabored) August 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com