Neetu Chandra: 'అద్దె భార్యగా ఉండమన్నాడు.. నెలకు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు..'

Neetu Chandra: సినిమాల్లో హీరోయిన్స్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తున్న డామినేట్ చేస్తు్న్న యంగ్ హీరోయిన్లవైపే మేకర్స్ ఎక్కువగా మొగ్గుచూపుతారు. అందుకే ఎంత సక్సెస్ సాధించినా కూడా కొందరు హీరోయిన్స్ తొందరగా ఫేడవుట్ అయిపోతారు. అలాంటి వారిలో కూడా కొంతమందే ముందుకు వచ్చి వారి కెరీర్ గురించి మాట్లాడగలుగుతారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
ఎన్నో అవార్డ్ విన్నింగ్ బాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నీతూ చంద్ర. అలా తాను తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా ఛాన్సులు కొట్టేసింది. విక్రమ్ కుమార్ తెరకెక్కించిన '13 బి' చిత్రంతో తను సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. అలాంటి నీతూకు ఇప్పుడు సినిమా ఆఫర్లు లేవు. దీని వల్ల తాను ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చిందన్న విషయాన్ని ఇటీవల బయటపెట్టింది నీతూ చంద్ర.
13 మంది జాతీయ అవార్డు గ్రహీతలైన నటుల సరసన హీరోయిన్‌గా చేశానని చెప్పుకొచ్చింది నీతూ. అలాంటి తనకు ఈరోజు పని లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ బడా బిజినెస్‌మ్యాన్ తనకు నెలకు రూ.25 లక్షలు ఇస్తానని, అద్దె భార్యగా ఉండమని కోరాడని చెప్పింది. అవకాశాలు లేకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ పరోక్షంగా వివరించింది. పలు మంచి చిత్రాల్లో నటించిన తర్వాత కూడా తాను ఇండస్ట్రీలో అనవసరంగా ఉన్నానని అనిపిస్తుందంటూ తన బాధను చెప్పుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com