Raimohan Parida: సినీ పరిశ్రమలో విషాదం.. మరో నటుడు ఆత్మహత్య..
Raimohan Parida: అసలు ఒడియా సినీ పరిశ్రమకు ఏమైంది..? ఒకరు లేదా ఇద్దరు కొన్ని రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారంటే అది యాదృచ్చికం అనుకోవచ్చు. కానీ దాదాపు 15 మంది కొన్ని రోజుల వ్యవధిలో మరణిస్తే దానిని ఏమనుకోవాలి? ప్రస్తుతం ఒడియా పరిశ్రమలో జరుగుతుంది అందే. తాజాగా మరో సీనియర్ నటుడు కూడా ఆత్మహత్యకు పాల్పడడం ఒడియా పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది.
ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించి అలరించిన రాయ్‌మోహన్ పరిదా.. భువనేశ్వర్‌లోని ప్రాచి విహార్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. 58 ఏళ్ల పరిదా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. జీరో నుంచి హీరోగా మారిన పరిదా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం నమ్మలేకున్నామని ఇతర నటీనటులు అంటున్నారు. కానీ పరిదా స్నేహితురాలు ఒకరు.. తన మరణం గురించి కీలక విషయాలు వెల్లడించారు.
పరిదా ఇంటి పక్కన ఉండే లీనా అనే వ్యక్తితో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేది. అయితే వారిద్దరూ అన్నాచెల్లెళ్లుగా ఉండేవారని లీనా తెలిపింది. అంతే కాకుండా పరిదా కొన్నాళ్లుగా దిగులుగా ఉంటున్నారని, దానికి ప్రత్యేకమైన కారణమేంటో చెప్పలేదు అన్నారు. అయితే పరిదా ఇంట్లో పరిస్థితులను గమనిస్తే.. తనకు తన కూతుళ్లకు, భార్యకు మధ్య ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపించేదని లీనా చెప్పారు.
పరిదా చివరిగా తన కూతుళ్లకు బై అని మెసేజ్ పెట్టారని పోలీసులు తెలిపారు. ఇది ఆత్మహత్య చేసుకునే కాసేపటికి ముందే అని వారి విచారణలో తేలింది. కాగా పరిదా ఇప్పటివరకు 100కు పైగా ఒడియా చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా 15కు పైగా బెంగాలీ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. 'సునా బావుజా', 'మెంటల్' వంటి ఎన్నో చిత్రాలు పరిదా కెరీర్‌లో గుర్తుండిపోతాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com