Rashmirekha Ojha: బుల్లితెర నటి ఆత్మహత్య.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్..
Rashmirekha Ojha: గత కొంతకాలంగా ఎంతోమంది యువ నటీనటులు ప్రాణాలు విడిచారు. ఆత్మహత్య రూపంలోనో లేక హత్య చేయబడడం వల్లనో.. గ్లామర్ ప్రపంచం ఎంతోమంది నటీనటులను కోల్పోయింది. తాజాగా మరో బుల్లితెర నటి ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది. ఆమె మరణం అనంతరం తన గదిలో దొరికిన సూసైడ్ నోట్ ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.
ఒడిశాకు చెందిన రష్మీ రేఖ ఓజా.. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తుంది. 'కెమిటి కహిబి కహా' సీరియల్‌తో బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. అయితే రష్మీ.. సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరు భార్యభర్తలు అని చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్నట్టుగా ఓనర్ పోలీసులకు తెలిపాడు. అంతే కాకుండా రష్మీ ఆత్మహత్య విషయాన్ని సంతోషే తమకు చెప్పాడన్నాడు.
తన చావుకు ఎవరూ కారణం కాదంటూ రష్మీ రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అంతే కాకుండా ఐ లవ్ యూ అని కూడా తను ఆ లేఖలో రాసింది. 'మిస్ యూ బాబా. నేను నిన్ను పైనుండి మిస్ అవుతూనే ఉంటాను. నేను మంచి కూతురిని కాదు' అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది రష్మీ. అయితే తమ కూతురు సంతోష్‌తో కలిసుంటుందనే విషయం తమకు ఇప్పటివరకు తెలియదని, తమ కూతురు చావుకు కారణం సంతోషే అయ్యింటాడని రష్మీ తండ్రి ఆరోపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com