Oscar: నాటు నాటు..తగ్గేదేలే..

నాటు నాటు సాంగ్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గడంలేదు. ఈనెల 12న ది అకాడెమీ 95వ ఆస్కార్ అవార్డుల ఈవెంట్‌లో ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు సాంగ్‌ను లైవ్ లో పాడనున్నారు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. ఇప్పటికే వారికి ఇన్విటేషన్ కూడా వచ్చేసింది.ఆస్కార్ స్టేజ్‌పై హాలీవుడ్‌ని షేక్ చేసే పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు మన సింగర్స్.
ఆస్కార్స్ అంటే.. వరల్డ్ వైడ్‌గా ఎంత క్రేజో చెప్పనవసరం లేదు. వరల్డ్ వైడ్ సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్‌కు మించిన అవార్డుల కార్యక్రమం మరొకటి లేదు. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారు ఆస్కార్స్ వరకు వెళ్తేనే చాలని కలలు కంటుంటారు. చాలా సార్లు మనదేశం నుంచి అస్కార్‌కు నామినేట్ అయ్యాయి కానీ జస్ట్ రెడ్ కార్పెట్‌పై ఫొటో షూట్ చేసుకుని వచ్చేస్తుంటారు. అయితే ఈసారి ఆస్కార్ స్టేజ్‌పై మన జెండాను రెపరెపలాడబోతుంది. అది కూడా మన తెలుగు పాట కావడం తెలుగు వారికి గర్వకారణం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com