Oscar: 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'కు ఆస్కార్
చరిత్ర సృష్టించిన భారతీయ డాక్యూమెంటరీ

ఆస్కార్‌లో భారతీయ డాక్యూమెంటరీ షార్ట్ ఫిలలిం సత్తా చాటింది. ఉత్తమ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్‌ను " ది ఎలిఫెంట్ విస్పరర్స్ " దక్కించుకుంది. ఫిలింమేకర్ గునీత్ మెంగా సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఈ అవార్డ్‌ను అందుకున్నారు. కాగా ఈ సినిమాకు కార్తీకి గొంజాల్వెజ్ దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని గునీత్ మెంగా ట్విట్టర్‌లో తెలియజేశారు. ఆస్కార్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇద్దరు మహిళలు కలిసి ఈ విజయాన్ని సాధించామన్నారు. నేను ఇంకా సంతోషంతో వణుకుతూనే ఉన్నాని పేర్కొన్నారు.
Next Story