OSCAR: అగ్నికి అహుతైపోయిన ఆస్కార్ అవార్డుల వేదిక
అమెరికాలోని ప్రఖ్యాత హాలీవుడ్ హిల్స్ తగలబడిపోతున్నాయి. లాస్ ఏంజిల్స్ లో చెలరేగిన కార్చిచ్చు హాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణాలను కాల్చివేస్తోంది. ఈ మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్ ఉండే వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. కాగా హాలీవుడ్ హిల్స్ లో ఉన్న ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే వేదిక కూడా కాలిపోయిందని సమాచారం. అనేక మంది సినీనటుల ఇల్లు ఈ కార్చిచ్చుకు ఆహుతయ్యాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆరు చోట్ల కార్చిచ్చులను అధికారులు గుర్తించారు. లాస్ ఏంజిల్స్ కాస్ట్లీ ఏరియా కావడంతో నష్టం కూడాఆ భారీగానే ఉంది. ఇప్పటివరకు రూ.4.2 లక్షల ఆస్తులు బూడిదై పోయాయి. ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటలీ, రోమ్ పర్యటనలను వాయిదా వేసుకొని.. స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఈ కార్చిచ్చులను అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్ రాజీనామా చేయాలని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు.
ఆస్కార్ ఓటింగ్ గడువు పొడిగింపు
ఆస్కార్ అకాడమి ఓటింగ్ గడువును పొడిగించారు. జనవరి 14 వరకు పొడిగిస్తున్నట్లు ఆస్కార్ కమిటీ తెలిపింది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్చిచ్చు కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మొదట జనవరి 12 తేదీనే ఆస్కార్ ఓటింగ్ కి తుది గడువుగా నిర్ణయించారు. ఇక, లాస్ ఏంజెల్స్‌లో అగ్నిప్రమాదం కారణంగా వేల ఎకరాలు దగ్ధమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. బాధితుల్లో సామాన్యులతో పాటు పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com