Oscars 2023: దీపికపై కంగన ఆసక్తికర ట్వీట్....
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీపిక పదుకోనే పై ట్వీట్ చేసింది. మళ్లీ అమ్మడికి ఏమొచ్చిందని కంగారు పడకండి. ఈసారి కంగన ట్వీట్ లో ద్వేషంగానీ, సెటైర్ కానీ కనిపించలేదు. పైగా అంతర్జాతీయ వేదికపై మెరిసినందుకు దీపికపై ప్రశంసలు కురిపించింది. దీపిక లుక్స్ దగ్గర నుంచి ఆమె హోస్టింగ్ వరకూ ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసించింది. దీపిక ఎంతో అందంగా ఉంది అంటూ మొదటుపెట్టిన కంగన ఆ వేదికపై నించోవడం అంత తేలికైనా విషయం కాదని ట్వీట్ చేసింది. ఆ సున్నిత భుజాలపై దేశ ఖ్యాతిని మోస్తూ అందంగానూ, హుందాగానూ మాట్లాడటం ఆమెకే సాధ్యమైందని కొనియాడింది. భారతీయ మహిళ తలచుకుంటే అన్నింటా జయకేతనం ఎగురవేయగలదని దీపిక నిరూపించిందని తెలిపింది. ఏమైనా కంగన పాజిటివ్ ట్వీట్ కు సినీ ప్రియులు మురిసిపోతున్నారనే చెప్పాలి. కంగన వంటి ఫైర్ బ్రాండ్ నుంచి ప్రశంసలు అందుకోవడం దీపికకే సాధ్యమైందని అంటున్నవారు లేకపోలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com