Oscars 2023: ఆస్కార్లు మాకెందుకయ్యా.. మరో గున్నని ఇవ్వండి చాలు

Oscars 2023: ఆస్కార్లు మాకెందుకయ్యా.. మరో గున్నని ఇవ్వండి చాలు
X
ఎలిఫెండ్ విష్పరర్స్ ప్రత్యేక విన్నపం; ఆస్కార్ వద్దు, మరో ఏనుగు గున్నని ఇవ్వండి చాలు అంటోన్న జంట...
ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ వేదికపై విజయకేతనం ఎగురవేసింది. యావత్ ప్రపంచం భారత్ వైపు తలతిప్పి చూసేశాలా చేసింది. వరల్డ్ టీవీలో ఎనుగుల సంరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన జంట పేర్లు మారుమోగిపోయాయి. అయితే, ప్రపం వేదికపై ఆస్కార్ గురించి నడుస్తున్న హంగామా ఆ ఇద్దరికీ మాత్రం పట్టడంలేదు. ఈ హడావిడికి దూరంగా పచ్చని అడవిలో సేదతీరుతున్న బొమ్మన్, బెల్లి జంట తమదైన లోకంలో హాయిగా గడిపేస్తున్నారు. ది ఎలిఫెంట్ విష్పరర్స్ గా కీర్తి గడించిన వీరు కొన్నేళ్లుగా సాగుతున్న తమ గున్న ఏనుగులు దూరమవ్వడంతో వాటిపై బెంగపెట్టుకున్నారు. ఇన్నాళ్లు చంటి పిల్లలా సాకుకున్న గున్న ఏనుగులను వయసు వచ్చేసరికి వేరే క్యాంప్ కు షిఫ్ట్ చేయడంతో ప్రస్తుతం ఇరువురూ తలో పనిలో నిమగ్నమయ్యారు. అయితే అంతర్జాతీయ వేదికపై జరుగుతున్న హడావిడి ఏమీ పట్టని బొమ్మన్ బెల్లీలు మాత్రం తమకు ఇవేమీ వద్దంటూ ఆస్కార్ ను సైతం తృణప్రాయంగా తోసిపుచ్చారు. దాని బదులు మరో చిన్నారి గున్నను ఇవ్వమంటున్నారు. అదే తమకు పదివేలంటున్నారు. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదే కాబోలు....

Tags

Next Story