Oscars 2023: గట్టిగానే ఇచ్చి పడేసిందిగా...

Oscars 2023: గట్టిగానే ఇచ్చి పడేసిందిగా...
ఆస్కార్ లో పనిలో పనిగా హోస్ట్ కు కౌంటర్ ఇచ్చేసిన మలాలా....

నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్జాహీ ఈ ఏడాది ఆస్కార్ వేదికపై సందడి చేసింది. ప్రత్యేక ఆహ్వానం మేరకు వేడుకలకు అతిథిగా హాజరైన మలాలాకు, కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీ కెన్నెల్ ఓ మెలిక ప్రశ్న సంధించాడు. దానికి మలాలా ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. 95వ ఆస్కార్ వేడుకలకు భర్త అసెర్ మాలిక్ తో పాటూ జంటగా విచ్చేసిన మలాలా సిల్వర్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై మెరిసిపోయింది. ఆస్కార్ వేడుకకు ఆమె రావడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. ఇక కార్యక్రమంలో భాగంగా తుంటరి ప్రశ్నలతో అతిథులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోనన వ్యాఖ్యాత జిమ్మి కిమ్మెల్ మలాలాకు కూడా ఓ కొంటె ప్రశ్నను సంధించాడు. మానవతా హక్కుల కోసం, మహిళా శిశు సంక్షేమం కోసం నువ్వు చేస్తున్న కృషి అమోఘం అంటూ ప్రశంసిస్తూనే... అత్యంత పిన్న వయసులో నోబెల్ గ్రహీతగా క్రిస్ పైన్, హారీ స్టైల్స్ పై ఉమ్మివేసిన ఘటనపై మీ అభిప్రాయం ఏంటని మలాలాను ప్రశ్నించాడు. దానికి ఏమాత్రం తడబడకుండా మలాలా నేను శాంతి గురించి మాత్రమే మాట్లాడతాను అంటూ హుందాగా సమాధానమిచ్చింది. దీంతో ఒక్కసారిగా సభ మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. మలాలా ఇచ్చిన సమాధానం సూపర్ అంటూ నెటిజెన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. మరోవైపు మలాలా సైతం ఇదే వీడియో క్లిప్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మానవత్వంతో వ్యవహరించండి అంటూ రాసుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story