Nayan Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియోకు రూ.25 కోట్లు.. స్ట్రీమింగ్ చేయనన్న ఓటీటీ సంస్థ..

Nayan Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి వీడియోకు రూ.25 కోట్లు.. స్ట్రీమింగ్ చేయనన్న ఓటీటీ సంస్థ..
X
Nayan Vignesh: ఇటీవల పెళ్లయ్యి నెలరోజులు పూర్తయిన సందర్భంగా మరికొన్ని ఫోటోలను విఘ్నేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Nayan Vignesh: 'నానుమ్ రౌడీ థాన్' సినిమా సమయంలో నయన్, విగ్నేష్‌కు పరిచయం ఏర్పడింది. ఇక కొన్నాళ్లకే వారు ప్రేమలో పడ్డారు. ఏడేళ్లుగా వీరిద్దరు కోలీవుడ్ క్యూట్ లవ్ బర్డ్స్‌గా కొనసాగుతున్నారు. ఇక జూన్ 9న వీరిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. చెన్నైలోని మహాబలిపురంలో వీరి పెళ్లి జరిగింది. అయితే వీరి పెళ్లి వీడియోను రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిన ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి.


విఘ్నేష్ శివన్.. పెళ్లి అయిపోయిన కాసేపటికే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. నయనతారకు ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల పెళ్లి తర్వాత వెంటనే తను షూటింగ్స్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం విఘ్నేష్, నయన్.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.


ఇటీవల పెళ్లయ్యి నెలరోజులు పూర్తయిన సందర్భంగా మరికొన్ని ఫోటోలను విఘ్నేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఎక్స్‌క్లూజివ్‌గా తమ పెళ్లి ఫోటోలను, వీడియోలను తమ ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ.. విఘ్నేష్ ఆ ఫోటోలను రివీల్ చేయడం వల్ల ఫలానా ఓటీటీ సంస్థ తమ పెళ్లి వీడియోను స్ట్రీమ్ చేయకూడదని నిర్ణయించుకుందట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలియదు.

Tags

Next Story