Sreejith Ravi: మైనర్ బాలికలను వేధించిన నటుడు.. పోక్సో చట్టంపై కేసు నమోదు..

Sreejith Ravi: మాలీవుడ్‌లో నటుడు విజయ్ బాబు సంఘటన పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఒక పేరున్న నటుడు అయ్యిండి.. ఒక అప్‌కమింగ్ నటితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తన పేరును బహిరంగంగా వెల్లడించడంతో విజయ్ బాబుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన జైలుకు కూడా వెళ్లాడు. ఆ ఘటన మరవక ముందే మాలీవుడ్‌లో మరో వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది.
ఎన్నో మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీజిత్ రవి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా పలు సినిమాల్లో కనిపించిన శ్రీజిత్.. పర్సనల్‌గా పలుమార్లు వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్నాడు. అంతే కాకుండా దీని వల్ల జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. 2016లో స్కూల్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా శ్రీజిత్ అరెస్ట్ అయ్యాడు. అయినా కూడా మరోసారి అలాంటి ప్రవర్తనతో వార్తల్లోకెక్కాడు.
గత సోమావారం.. తిస్సూర్‌లోని ఎస్‌ఎన్ పార్క్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థినులను శ్రీజిత్ వేధించాడు. ఆ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూసి వారు చెప్పింది నిజమే అని నిర్ధారించారు. దీంతో పోలీసులు శ్రీజిత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వేధింపులకు గురయిన బాలికల వయసు 9, 14గా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com