Paul Haggis: ఆస్కార్ గెలుచుకున్న డైరెక్టర్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్..
Paul Haggis: బయట మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపుల కేసులు ఎక్కువయిపోతున్నాయి. ఎప్పటినుండో సినీ పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూ ఉన్నా.. అవి బయటికి చెప్పడానికి బాధితులు భయపడేవారు. కానీ ఇప్పుడు తప్పు చేసింది ఎంత పెద్ద వ్యక్తి అయినా.. భయపడకుండా వారికి జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలోనే ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యారు.
ఇటలీకి చెందిన దర్శకుడు పాల్ హగ్గీస్.. 'క్రాష్' అనే చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. అలాంటి దర్శకుడిపై ఓ ఫారిన్ యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టడం కలకలం సృష్టించింది. అంతే కాకుండా తనను శారీరికంగా కూడా గాయపరిచాడని ఆ యువతి ఆరోపించినట్లు సమాచారం. దీంతో పాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాల్.. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. యువతి తరపున న్యాయవాది కోర్టులో తెలిపారు. అయితే పాల్‌కు ఏమీ తెలియదని, తను నిర్దోషి అని, విచారణ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిదని.. పాల్ తరపున న్యాయవాది అన్నారు. కోర్టు ఈ కేసుపై ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. కాసేపటి పరిచయంలోనే పాల్.. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు న్యాయవాది ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com