6 July 2022 11:45 AM GMT

Home
 / 
సినిమా / సమస్తం / Pooja Hegde: బీస్ట్...

Pooja Hegde: బీస్ట్ ప్లాప్.. అయినా మరో తమిళ స్టార్‌తో పూజా జోడీ..

Pooja Hegde: పూజా హెగ్డేకు లక్ బాగా కలిసొస్తుంది. తాను చేసిన పాన్ ఇండియా చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా ఆఫర్లకు బ్రేక్ లేదు.

Pooja Hegde: బీస్ట్ ప్లాప్.. అయినా మరో తమిళ స్టార్‌తో పూజా జోడీ..
X

Pooja Hegde: మామూలుగా సినిమా హిట్, ఫ్లాప్ అనే విషయాలు నటీనటుల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ప్రభావం చూపిస్తాయి. ఒక సినిమా ఫ్లాప్ అవ్వగానే వారి మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గిపోతాయి. కానీ పూజా హెగ్డేకు మాత్రం లక్ బాగా కలిసొస్తుంది. తాను చేసిన పాన్ ఇండియా చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా ఆఫర్ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి పూజా హెగ్డే చేసిన చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ అప్‌కమింగ్ చిత్రాలపై చాలా ఎఫెక్ట్ పడింది. అలాగే పూజా కెరీర్‌కు కూడా అవుతుంది అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. బీస్ట్ రూపంలో మరో పాన్ ఇండియా అవకాశం తనను వరించింది. అది ఫ్లాప్ అయినా కూడా పూజాకు అవకాశాలు రావడం మాత్రం ఆగలేదు.

బీస్ట్‌తో తమిళ ప్రేక్షకులను పూజా రెండోసారి పలకరించినా.. చాలావరకు అది తన డెబ్యూ మూవీగానే పరిగణించారు. ఇక అదే ఫ్లాప్ అవ్వడంతో పూజాకు కోలీవుడ్‌లో ఫ్యూచర్ లేదనుకున్నారు. కానీ తమిళ స్టార్ సూర్య నటిస్తున్న చిత్రంలో పూజా ఆఫర్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన చిత్రం వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ దానిని పట్టాలెక్కించాలి అనుకంటున్నాడు సూర్య. ఆ సినిమాలో సూర్య సరసన పూజా పాపా ఆడిపాడనుందని సమాచారం.

Next Story