Pooja Hegde: యశ్‌కు జోడీగా పూజా.. రెమ్యునరేషన్ విషయంలో చుక్కలే..!

Pooja Hegde: యశ్‌కు జోడీగా పూజా.. రెమ్యునరేషన్ విషయంలో చుక్కలే..!
Pooja Hegde: పూజా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలో నటిస్తోంది.

Pooja Hegde: పాన్ ఇండియా చిత్రాల్లో నటించిన తర్వాత హీరోయిన్లు కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు. భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు అందుకోవడంతో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేదే లేదు అంటున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో పూజా హెగ్డే కూడా ఒకరు. తాజాగా తనకు శాండిల్‌వుడ్ నుండి కూడా పిలువు వచ్చినట్టు సమాచారం.


పూజా హెగ్డే మాతృభాష కన్నడ అయినా ఇప్పటివరకు ఒక కన్నడ చిత్రంలో కూడా నటించలేదు. తమిళంలో హీరోయిన్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగులోనే స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. పూజా ఈమధ్య నటించిన పాన్ ఇండియా చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయినా కూడా అవకాశాలు అందుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనకు శాండిల్‌వుడ్ నుండి కూడా పిలువు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

'కేజీఎఫ్' సినిమాల సక్సెస్‌తో శాండిల్‌వుడ్‌కే రాకీ భాయ్ అయిపోయాడు యశ్. యశ్.. తన తరువాతి సినిమాను 'మఫ్తీ' దర్శకుడు నర్తన్‌తో చేయనున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే సెలక్ట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక యశ్‌లాంటి స్టార్ హీరోతో నటించడానికి పూజా నిర్మాతలకు చుక్కలు చూపించే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట.


పూజా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'జనగణమన' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కోసం కూడా పూజా బాగానే పారితోషికం అందుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు యశ్‌తో చేసే సినిమాకు మాత్రం పూజా రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టి మేకర్స్ కూడా పూజా ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.


Tags

Read MoreRead Less
Next Story