ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఛీఫ్‌ గెస్ట్‌ చినజీయర్‌

ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఛీఫ్‌ గెస్ట్‌ చినజీయర్‌
X
పాన్‌ ఇండియా లెవల్‌లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. బాహుబలి తరువాత తన క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది

పాన్‌ ఇండియా లెవల్‌లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. బాహుబలి తరువాత తన క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు రెబల్‌స్టార్‌. ఈ క్రమంలోనే ఓం రౌత్‌ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్‌ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్‌లో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ నటిస్తోంది.

రామాయణ మాహా కావ్యం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాఘవుడిగా కృతి జానకిగా నటిస్తుండగా సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్వరుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతిలోనే విడుదల కావలసి ఉండగా వీఎఫ్‌ఎక్స్‌ సరిగ్గా ఉండకపోవడంతో చిత్ర బృదం దానిపై దృష్టి పెట్టింది. గ్రాఫిక్స్‌, త్రీడీ మోషన్‌లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో రెడు సార్లు ట్రైలర్‌లు కూడా విడుదల చేసింది. కాగా ఈ సినిమా జూన్‌ 16వ తేదీనా తెలుగు, హింది, తమిళ్‌,మళయాళం, కన్నడ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది.

అందు కోసం మూవీ మేకర్స్‌ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా జూన్‌ 6వ తేదీన తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనుంది. ఇందుకు గాను తిరుపతి ఎస్వీ కళాశాల గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకకు ముఖ్య అథితిగా చినజీయర్‌ స్వామి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వేడుకలో రెండు వందల మంది గాయకులు రెండు వందల మంది నాట్యకారులు ఓకే సారి ప్రదర్శన చేయనున్నారు. అదే విధంగా ఈ వేడుకలో కాల్చే టందుకు ప్రత్యేకమైన బానాసంచాను ఏర్పాటు చేస్తున్నారు. ఆ బానాసంచ కాల్చగానే జై శ్రీరాం అంటు శబ్దం రావడం ప్రత్యేకత అట.

Tags

Next Story