Prabhudeva: కొత్త అవతారంలో ప్రభుదేవా....

ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా పేరుగడించిన ప్రభుదేవ వీలైతే యాక్టింగ్ లేదంటే డైరెక్టింగ్ అన్న చందాన్న ముందుకు సాగిపోతున్నాడు. ఈ మధ్యకాలంలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఈ డాన్సింగ్ సూపర్ స్టార్ తాజాగా 'వుల్ఫ్' అనే మూవీలో నటించాడు. వినూ వెంకటేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బహు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలవ్వగా సినిమా పక్కా థ్రిల్లర్ అని అర్థమైపోతోంది. ఇక ఉళ్లపెడుతోన్న తేడేళు వాయిస్ వెన్నులో వణకు పుట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుదేవను ఇలాంటి పాత్రలో చూసి ఉండకపోవడంతో ఫ్యాన్స్ కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'వుల్ఫ్'లో అంజు కురియన్, అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మీ, శ్రీ గోపిక, రమేశ్ తిలక్ కీలక పాత్రలు పోషించారు. చెన్నై, బెంగళూరు, అండమాన్ నికోబార్, పుదుచెర్రీలో చిత్రీకరణ జరుపుకోగా, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకు చిత్ర బృందం భారీ ప్రణాళికలే వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com